• Sep 20, 2026
  • NPN Log

    పుణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇవాళ (శనివారం) పుణె కోర్టులో 5,053 పేజీల ఛార్జిషీట్‌ను సమర్పించారు. ఈ సందర్భంగా హత్య పథక రచన నుంచి అమలు వరకు జరిగిన అన్ని అంశాలను వివరించారు. పోలీసుల ఛార్జిషీట్ ప్రకారం.. కేతన్ అగర్వాల్ (25)కు సియా గోయల్ (20)తో వివాహం జరగాల్సి ఉంది. వీరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరగగా.. నవంబర్‌లో జైపూర్ వేదికగా అంగరంగ వైభవంగా వివాహం జరగాల్సి ఉంది.

    అయితే, కేతన్ అగర్వాల్‌ను వివాహం చేసుకోవడం సియా గోయల్‌కు ఇష్టం లేదని పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి, రితేష్ హంగే అనే మరో నిందితుడు పథకం రచించినట్లు వెల్లడించారు. ఈ కుట్రలో భాగంగా నిందితులు కేతన్‌కు తెలిసిన ఓ యువతి ఫొటోను ఉపయోగించి ‘మాహి’ పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఖాతా ద్వారా కేతన్‌తో చాటింగ్ చేశారని చెప్పారు. ఈ మేరకు జూన్ 18న లోహగడ్ కోట వద్ద సియాకు ముందస్తు పుట్టినరోజు సర్‌ప్రైజ్ ఇవ్వాలని అతన్ని నమ్మించినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.

     

    జూన్ 18న సియాను ఆ యువ వ్యాపారవేత్త అక్కడికి తీసుకెళ్లగా.. నిందితులు కోట పైనుంచి తోసి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. జూన్ 14న కూడా అదే ప్రాంతంలో హత్యకు ప్లాన్ చేసి విఫలమయ్యారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సియా, చేతన్, రితేష్ హంగేను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ కేసు ఛార్జిషీట్‌లో ఐదుగురు ప్రత్యక్ష సాక్షులతో సహా 100 మందికి పైగా వ్యక్తుల వాంగ్మూలాలను పోలీసులు పొందుపరిచారు. నిందితుల మొబైల్ ఫోన్ డేటా, వాట్సాప్ చాట్‌లు, ఫొటోలు, కాల్ రికార్డులు వంటివి కోర్టుకు సమర్పించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement