క్రికెట్‌కు మేఘన గుడ్‌బై
హైదరాబాద్: టీమిండియా టాపార్డర్ బ్యాటర్ సబ్బినేని మేఘన ఆటకు గుడ్‌బై చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన 30 ఏళ్ల మేఘన పదేళ్ల క్రితం వెస్టిండీస్‌తో టీ20ల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. మూడు వన్డేలు, 17 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. చివరిగా 2022లో టీమిండియాకు ఆడిన మేఘన.. డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్, బెంగళూరు జట్లకు ఆడింది.










Comments