కళ్యాణదుర్గం నియోజకవర్గం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరు.
Npn, news.కోటి సంతకాల పత్రాలు అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయానికి తరలింపు
భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మాజీ ఎంపీ తలారి రంగయ్య కృతజ్ఞతలు
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమం కీలక దశకు చేరుకుంది.
ఈ ఆందోళనలో భాగంగా సేకరించిన కోటి సంతకాలతో కూడిన పత్రాలను కళ్యాణదుర్గంలోని వైసీపీ కార్యాలయం నుండి అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయానికి తరలించారు.
ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అనంతపురం మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సంతకాల సేకరణ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.










Comments