కీవ్ విద్యుత్ కేంద్రంపై దాడి.. ట్రంప్ ప్రకటన చేసినా వెనక్కి తగ్గని రష్యా..
అంతకుముందు ఖార్కివ్ ప్రాంతంలోని విద్యుత్ కేంద్రాలపైనా దాడులు జరిగినట్లు వెల్లడించారు. అక్టోబర్ 11న కీవ్లోని ఓ విద్యుత్ కేంద్రంపై రష్యాకు చెందిన షాహెద్ డ్రోన్ దాడి చేసినట్లు జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడి కారణంగా రాజధానిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే తూర్పు ఉక్రెయిన్లోని ఖార్కివ్ ప్రాంతంలోని ఇంధన మౌలిక సదుపాయాలపైనా దాడులు జరిగినట్లు వెల్లడించారు.
రోజంతా డ్రోన్లు, ఇతర వైమానిక దాడులతో ఉక్రెయిన్ను రష్యా లక్ష్యంగా చేసుకుందని జెలెన్స్కీ ఆరోపించారు. కాగా, అంతకు ముందు రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేసేందుకు అంగీకరించాయని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకటనలో ఒప్పందానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, అమలు విధానం వంటి వివరాలను వెల్లడించలేదు. రష్యా కూడా ఈ ఒప్పందానికి అంగీకరించినట్లు అధికారికంగా ధ్రువీకరించలేదు.










Comments