గిరిజన ప్రాంతాలపై దృష్టి పెట్టాలి
అమరావతి : రాష్ట్రంలో అత్యంత వెనకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా కలెక్టర్లను కోరారు. గిరిజన, ఇతర ప్రాంతాల్లో పాలనా సామర్ధ్య పెంపు కోసం కృషి చేయాలన్నారు. కేంద్ర పథకాల అమలులో అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలు 100 శాతం ఫలితాలు సాధించాయంటూ ఆ జిల్లాల కలెక్టర్లను పవన్ అభినందించారు. నాలుగు వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను నిర్మించామని, 1.20 లక్షల ఫాం పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామని వివరించారు.










Comments