• Sep 20, 2026
  • NPN Log

    ములకలచెరువు : రాష్ట్రంలో సంచలనం రేపిన ములకలచెరువు నకిలీ మద్యం కేసు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితులైన తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌రెడ్డి మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టులో లొంగిపోయారు. న్యాయమూర్తి సుబహాన్‌ వీరికి ఈ నెల 28 వరకు రిమాండ్‌ విధించారు. దీంతో నిందితులను ఎక్సైజ్‌ పోలీసులు కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. ములకలచెరువు కేంద్రంగా జరిగిన నకిలీ మద్యం తయారీ గుట్టును గతేడాది అక్టోబరు 3న ఎక్సైజ్‌ అధికారులు రట్టు చేశారు. ఈ కేసులో 33 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో దాసరిపల్లె జయచంద్రారెడ్డి(ఏ17), ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌రెడ్డి (ఏ18)గా ఉన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement