నేడు జనసేన ‘పదవి-బాధ్యత’
అమరావతి : కూటమి ప్రభుత్వంలో జనసేన పక్షాన నామినేటెడ్ పదవులు పొందిన వారితో ‘పదవి-బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం భేటీ కానున్నారు. మంగళగిరిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం గురించి మంత్రి మనోహర్ ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లకు వివరించారు. దాదాపు 3వేల మందితో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో నామినేటెడ్ పదవులు పొందిన వారందరికీ పవన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.









Comments