ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం:
బిజెపి జిల్లా అధ్యక్షులు రామకృష్ణ
కౌతాళం: బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కౌతాళంలో ‘చేరువ’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, ‘ఛాయ్ పే చర్చ’ ద్వారా ప్రజలు, పాత్రికేయుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యావైద్య సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి 15 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి శుక్రవారం స్థానిక నాయకులకు వినతులు అందించాలని, ప్రజల కోసం నెట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.









Comments