పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..
విజయవాడ : ప్రసాదంపాడులో నలుగురు మావోయిస్టులు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే వీరిని విజయవాడ ఎంఎస్జే కోర్టు పోలీసుల కస్టడీకి ఇచ్చింది. కోర్టు ఆదేశంతో ఇవాళ(శుక్రవారం) నుంచి ఆదివారం వరకు కస్టడీలోకి తీసుకోనున్నారు. నెల్లూరు జైల్లోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలో విచారించడానికి అనుమతి ఇవ్వాలని ఎంఎస్జే కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మావోయిస్టులను విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసలు భావిస్తున్నారు.









Comments