• Dec 11, 2025
  • NPN Log

    పనజి: గోవాలోని 'బిర్క్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన వెంటనే దేశం విడిచి పరారైన క్లబ్ యజమానుల్లో ఒకరైన గౌరవ్ లూథ్రా ఆచూకీ తెలిసింది. థాయ్‌లాండ్‌  లోని పుకెట్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ చెక్ సమయంలో ఆయన కనిపించారు. ఆ తర్వాత సోదరులిద్దరూ పుకెట్ రిసార్ట్‌కు చేరుకున్నారని, అయితే అధికారులు అక్కడకు చేరుకునే లోపే ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టారని తెలుస్తోంది. నైట్‌క్లబ్ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది గంటలకే లూథ్రా సోదరులు దేశం విడిచి పారిపోయారు.

    ఇక ఈ కేసులో కీలక ఆధారాలను ప్రభాకర్ రావు ధ్వంసం చేశారంటూ సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. డిజిటల్ ఎక్విప్‌మెంట్, పాస్ వర్డ్ ఇవ్వకుండా విసిగించడంతోపాటు విచారణకు ఆయన ఏ మాత్రం సహకరించడం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తమ వాదనలను వినిపించారు. దీంతో ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐ క్లౌడ్, పాస్ వర్డ్ రీసెట్ చేయాలని గత విచారణలో ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.


    ఇంతకీ ఏం జరిగిందంటే.. ?

    బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలపైనే కాకుండా.. స్వపక్షంలోని పలువురి కీలక నేతలపై ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు సైతం ఆరోపించారు. 2023 ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీకి ఓటరు పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది.

    ఫోన్ ట్యాపింగ్ అంశంపై వాస్తవాలు వెలికి తీయాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌లో కీలకంగా వ్యవహరించిన పలువురు ఉన్నతాధికారులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాంతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమని సిట్ అధికారుల ధృవీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు.

    అయితే ఈ కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. అమెరికాలో ఉన్నారు. ఆయనను భారత్‌కు రప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్ రావు.. సిట్ అధికారులు అరెస్ట్ చేయకుండా ఉండాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభాకర్ రావును ముందస్తు అరెస్ట్ చేయవద్దంటూ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

    అనంతరం ఈ కేసు విచారణకు హాజరైన ప్రభాకర్ రావు.. సిట్ అధికారులు సంధించిన పలు ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు. మరోవైపు ప్రభాకర్ రావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును రేవంత్ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ కేసును బుధవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ప్రభాకర్ రావు బెయిల్‌ను రద్దు చేస్తుందా? లేదా? అంటూ ఒక చర్చ తెలంగాణలో వాడి వేడిగా నడుస్తోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement