• Jul 28, 2026
  • NPN Log

    ఫ్రాన్స్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా దిగ్గజ ప్లేయర్ జినడిన్ జిదాన్‌ను నియమిస్తూ ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది. ఫిఫా ప్రపంచ కప్ 2026లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత డిడియర్ డిషాంప్స్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేసిన జినడిన్.. నాలుగేళ్ల ఒప్పందంపై సంతకం చేశారు. 2030 ప్రపంచ కప్ వరకు ఫ్రాన్స్ కోచ్‌గా ఆయన కొనసాగనున్నారు.

    డిషాంప్స్ 14 ఏళ్ల కోచింగ్ హయాంలో ఫ్రాన్స్ జట్టు ఎన్నో విజయాలు సాధించింది. ఫిఫా ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్‌లో స్పెయిన్ చేతిలో చిత్తుగా ఓడింది. అనంతరం మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఇంగ్లండ్ చేతిలో 6-4 తేడాతో పరాజయం పాలవ్వడంతో ఆయన కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. 2021లో ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ సీఎఫ్‌ కోచ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత జిదాన్ మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టలేదు. అయితే ఫ్రాన్స్ జట్టు కోచ్ పదవికి ఆయనే వారసుడు అంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ ఊహాగానాలన్నింటినీ నిజం చేస్తూ ఫ్రాన్స్ ఫెడరేషన్ అధికారిక ప్రకటన చేసింది.

    రియల్ మాడ్రిడ్ కోచ్‌గా జిదాన్ అత్యంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన నాయకత్వంలో క్లబ్ వరుసగా మూడు సార్లు యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. అలాగే రెండు లా లిగా, రెండు ఫిఫా క్లబ్ వరల్డ్ కప్, రెండు యూఈఎఫ్ఏ సూపర్ కప్, రెండు స్పానిష్ సూపర్ కప్ ట్రోఫీలను కూడా అందుకుంది. ఫ్రాన్స్ కోచ్‌గా జిదాన్ తొలి పరీక్ష ఈ ఏడాది జరిగే యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్‌లో ఉండనుంది. తుర్కియే, బెల్జియం, ఇటలీతో కలిసి ఉన్న గ్రూప్‌లో ఫ్రాన్స్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 25న తుర్కియేతో ఆడనుంది. అనంతరం యూరో-2028 అర్హత పోటీలకు జట్టును సిద్ధం చేయడం జిదాన్ ముందున్న ప్రధాన సవాలుగా మారింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement