• Oct 24, 2026
  • NPN Log

    పారిస్‌ : హ్యాకర్లు పెద్ద పెద్ద కంపెనీల సర్వర్లను హ్యాక్‌ చేయడం గురించి విని ఉంటారు! కొన్ని దేశాలు శత్రు దేశాల రక్షణ వ్యవస్థలను హ్యాక్‌ చేయడానికి ప్రయత్నించిన ఘటనల గురించీ చదివి ఉంటారు!! కానీ.. సూపర్‌ మార్కెట్లలో డీప్‌ ఫ్రీజర్లను హ్యాక్‌ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? అక్టోబరు 11వ తేదీ రాత్రి ఫ్రాన్స్‌లో అదే జరిగింది! ఆ దేశవ్యాప్తంగా ఉన్న పలు సూపర్‌మార్కెట్‌ చైన్లలోని డీప్‌ ఫ్రీజర్లను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. ఆ ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలను వారు ఆరు గంటలపాటు 50 డిగ్రీల వద్ద ఉంచడంతో.. వాటిలోని పదార్థాలన్నీ చెడిపోయాయి. కొన్ని ఫ్రీజర్లలో మంటలు సైతం చెలరేగాయి. ఫలితంగా కొన్ని కోట్ల యూరోల నష్టం వాటిల్లింది. అక్టోబరు 12వ తేదీ ఉదయాన్నే.. పలు సూపర్‌ మార్కెట్ల వద్ద.. పాడైపోయిన పాల ఉత్పత్తులు, ఇతర పదార్థాలను చెత్త కంటెయినర్లలో తరలించిన దృశ్యాలు కనిపించాయి. అయితే, ఈ హ్యాకింగ్‌ ఒక్క తమదేశానికే పరిమితం కాలేదని.. స్పెయిన్‌, పోర్చుగల్‌, జర్మనీ, పోలండ్‌, బెల్జియం దేశాల్లో కూడా ఫ్రీజర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఫ్రాన్స్‌ అధికార వర్గాలు వెల్లడించాయి. డెన్మార్క్‌కు చెందిన డాన్‌పోస్ అనే కంపెనీ తయారుచేసిన కంట్రోలర్లు ఉన్న డీప్‌ఫ్రీజర్లే దాడికి గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై ఆ సంస్థను సంప్రదించగా.. హ్యాక్‌ అయిన ఫ్రీజర్లన్నీ 2016, 2021 నాటి మోడళ్లని.. కొత్త మోడళ్లకు అప్‌గ్రేడ్‌ కావాలన్న తమ సూచనను సూపర్‌మార్కెట్లు పట్టించుకోలేదని ఆ సంస్థ చెబుతోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).