ఫేవరెట్ యువ భారత్
దుబాయ్: అండర్-19 ఆసియా కప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న యువ భారత్.. అదే తరహా ప్రదర్శనతో ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకోవాలనుకొంటోంది. శుక్రవారం జరిగే తొలి సెమీ్‌సలో శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు చక్కటి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ ఆయుష్ మాత్రే భారీ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. కనిష్క్ చౌహాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన జట్టుకు ప్లస్ కాగా.. పేసర్ దీపేష్ దేవేంద్రన్ ప్రత్యర్థులకు వణుకుపుట్టిస్తున్నాడు. మరోవైపు లంక సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది. ఇక రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్-బంగ్లాదేశ్ జట్లు శుక్రవారం దుబాయ్‌లోనే మరో వేదికలో తలపడనున్నాయి.









Comments