• Jul 27, 2026
  • NPN Log

    వాషింగ్టన్‌ : భారత్‌ సహా 17 దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 10% సుంకాలను విధించింది. ఈ సుంకాలు అత్యధిక లేక బలవంతపు శ్రమతో ఉత్పత్తి అవుతున్న వస్తువులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. గత నెలలో వాణిజ్య చట్టంలోని సెక్షన్‌ 301 ప్రకారం.. భారత్‌ సహా ఇతర దేశాలపై అమెరికా 12.5ు సుంకాలను విధించింది. అయితే, భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా అత్యధిక శ్రమతో ఉత్పత్తి అయ్యే వస్తువుల దిగుమతిని భారత్‌ నిషేధించింది. ఈ మేరకు ఒప్పందంలో చేసిన సవరణను అమెరికా పరిగణనలోకి తీసుకుంది. టారి్‌ఫను 10శాతానికి తగ్గించింది. కాగా, ట్రంప్‌ సర్కారు ఈ బలవంతపు శ్రమ అన్న కారణంతోనే 43 దేశాలపై 12.5% సుంకాలు విధించింది. ఇవి శుక్రవారం నుంచే అమల్లోకి రానున్నాయి.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement