లండన్ హోటల్‌లో సౌదీ రాకుమారుడి మృతి
లండన్ : లండన్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడు మృతిచెందారు. మద్యం, డ్రగ్స్ అతిగా తీసుకోవడం వల్లే ఆయన మరణించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన 2025 నవంబర్‌లో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సౌదీ రాజకుమారుడు అబ్దుల్లా ఫహద్ బిన్(29) గతేడాది నవంబర్ 19న లండన్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో చెక్ ఇన్ అయ్యారు. నవంబర్ 25న ఆయన బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని హోటల్ సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న వైద్యులు అక్కడికి చేరుకుని కాపాడేందుకు ప్రయత్నించిగా, ఆయన అప్పటికే మృతి చెందారు. మద్యం, డ్రగ్స్ అతిగా తీసుకోవడంతో ఆయనకు గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు.










Comments