• Aug 25, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : విదేశాల్లో ఆస్తులు, షేర్లు, బ్యాంక్‌ ఖాతాలు, ఇతర పెట్టుబడుల స్వచ్ఛంద వెల్లడికి కేంద్రం ప్రభుత్వం వన్‌టైమ్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇందుకోసం ‘ఫారిన్‌ అసెట్స్‌ ఆఫ్‌ స్మాల్‌ ట్యాక్స్‌పేయర్స్‌ - డిస్‌క్లోజర్‌ స్కీమ్‌ (ఫాస్ట్‌-డీఎస్‌)’ను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి(సీబీడీటీ) నోటిఫై చేసింది. ఆదివారం (ఆగస్ట్‌ 16) మొదలయ్యే ఈ పథకం, డిసెంబర్‌ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో రెండు విభాగాలున్నాయి. పన్ను చెల్లించని ఆదాయంతో సమకూర్చుకున్న విదేశీ ఆదాయం, విదేశీ ఆస్తులు మొదటి కేటగిరీ కిందకు వస్తాయి. 2026 మే 31 నాటికి వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తుల విలువ రూ.కోటికి మించని వారు.. కేటగిరీ-1 కింద 30ు పన్ను, మరో 30ు పెనాల్టీ కింద మొత్తం 60ు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మార్చి 31 నాటికి విదేశీ బ్యాంక్‌ ఖాతాలో రూ.60 లక్షలు ఉన్నాయని అనుకుందాం. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.20 లక్షల విదేశీ ఆదాయాన్ని కూడా వెల్లడించలేదు. అప్పుడు ఈ మొత్తం రూ.80 లక్షలు అవుతుంది. దీనిపై పన్ను, పెనాల్టీ కింద మొత్తం.. రూ.48 లక్షలు చెల్లించాలి. గతంలో ప్రవాస భారతీయుడిగా ఉన్న సమయంలో (ఎన్‌ఆర్‌ఐ) వచ్చిన ఆదాయంతో భారత్‌కు వెలుపల సమకూర్చుకున్న ఆస్తులు.. లేదా భారత్‌లో పన్ను చెల్లించిన ఆదాయంతో విదేశాల్లో ఆస్తులు సమకూర్చుకుని ఐటీఆర్‌లో వెల్లడించని వారికి కేటగిరీ-2 వర్తిస్తుంది. ఆయా ఆస్తుల విలువ రూ.5 కోట్లకు మించకపోతే కేవలం రూ.లక్ష ఫీజు చెల్లించి తమ తప్పును మాఫీ చేసుకోవచ్చు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement