హైదరాబాద్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో కాల్చి..
హైదరాబాద్ : ఓ చిన్నారిపై ట్యూషన్ టీచర్ శ్రీ మానస దాష్టీకానికి పాల్పడ్డారు. అట్లకాడతో వాతలు పెట్టారు టీచర్. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఏడేళ్ల బాలుడును అట్లకాడతో కాల్చారు ట్యూషన్ టీచర్. ఓయూ కాలనీకి చెందిన ఒకటో తరగతి విద్యార్థి వల్లు తేజ నందన్‌పై దాడికి పాల్పడ్డారు ట్యూషన్ టీచర్ శ్రీ మానస.
ట్యూషన్లో బాలుడు సరిగా చదవడం లేదనే కారణంతో చేతులు, కాళ్లు, ముఖంపై వాతలు పెట్టారు ట్యూషన్ టీచర్. అట్లకాడతో తేజనందన్ శరీరంపై 8 చోట్ల కాల్చారు ట్యూషన్ టీచర్ శ్రీ మానస. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాలుడును వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు ఫిల్మ్‌నగర్ పోలీసులు. తమ కొడుకును విచక్షణ రహితంగా అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్ శ్రీ మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తల్లిదండ్రులు. ట్యూషన్ టీచర్ మానస అట్లకాడతో కాల్చడంతో నడవలేకపోతున్నాడు బాలుడు తేజ నందన్.









Comments