హూతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేశాం.. సౌదీ దళాల ప్రకటన
సౌదీ అరేబియాలోని ఖమీస్ ముషాయిత్పై హూతీలు ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను తాము ధ్వంసం చేశామని యెమెన్‌లోని సౌదీ సంకీర్ణ దళాలు ఈరోజు (మంగళవారం) ప్రకటించాయి. అలాగే సోమవారం రాత్రి రియాద్‌పై ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న విషయాన్ని కూడా ఆ దళాలు వెల్లడించాయి. కాగా గత కొన్ని రోజులుగా సౌదీ అరేబియా విమానాశ్రయాలపై వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో కనీసం 13 మంది మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారు. సౌదీ విమానాశ్రయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంలోని ఎయిర్‌పోర్ట్‌లకు పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేస్తున్నాయి. తాజాగా యూఏఈకి చెందిన ఓ విమానయాన సంస్థ నవంబర్ 29 వరకు రియాద్‌కు విమాన సర్వీసులను రద్దు చేశామని తెలిపింది.










Comments