అంబానీ ఆస్తి.. 24 రాష్ట్రాల జీడీపీ కంటే అధికం
హురూన్ రిచ్ లిస్ట్-2025లో ముకేశ్ అంబానీ రూ.9.55 లక్షల కోట్లతో తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ నెట్‌వర్త్ దేశంలోని 24 రాష్ట్రాల జీడీపీ కంటే అధికం. ఇండియా ఇన్ పిక్సెల్ డాటా ప్రకారం.. నాలుగు రాష్ట్రాలు మాత్రమే అంతకంటే ఎక్కువ జీడీపీ కలిగి ఉన్నాయి. మహారాష్ట్ర రూ.24.11 లక్షల కోట్లు, తమిళనాడు రూ.15.71 లక్షల కోట్లు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రూ.14.23 లక్షల కోట్ల జీడీపీతో ముందున్నాయి.
Comments