• Oct 05, 2025
  • NPN Log

    తమిళ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం 'మందాడి'. తమిళ కమెడియన్ సూరి హీరోగా నటిస్తున్నఈ చిత్రంలో తెలుగు నటుడు సుహాస్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చెన్నై సముద్రతీరంలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్ సమయంలో సాంకేతిక నిపుణులు ఉన్న పడవ సముద్రంలో బోల్తా పడింది. ఆ సమయంలో ఆ పడవలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరినీ మిగిలిన వారు కాపాడారు. అయితే కెమెరాలు, ఇతర షూటింగ్ సామగ్రి మాత్రం సముద్రంలో కొట్టుకుపోయాయి. దాదాపు కోటి రూపాయల వరకు నష్టం సంభవించినట్టు వార్తలు వస్తున్నాయి.

    సుహాస్‌కు ఇది తొలి తమిళ సినిమా . మతిమారన్ పుగళేంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వెట్రిమారన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.
     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement