అభిషేక్ శర్మ, స్మృతి మంధానకు ఐసీసీ అవార్డ్!
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, భారత మహిళల స్టార్ ప్లేయర్ స్మృతి మంధానకు అరుదైన అవార్డ్ దక్కింది. సెప్టెంబర్ నెలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ఈ ఇద్దరి ప్లేయర్లకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్' వరించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 టోర్నీలో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన విషయం తెలిసిందే.
ఆసియా కప్ 2025 టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 200 స్ట్రైక్‌రేట్, 44.58 సగటుతో 314 పరుగులు చేశాడు. అంతేకా ఆ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ అందుకున్నాడు. అతని అద్భుత బ్యాటింగ్ తో ఈ టోర్నీలో టీమిండియా ఓటమి అనేది లేకుండా విజేతగా నిలిచింది. అలానే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కూడా కొనసాగుతున్నాడు.
అభిషేక్ శర్మ పాటు ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ కూడా ఈ అవార్డ్ రేసులో నిలిచాడు. జింబాబ్వే ప్లేయర్ బ్రియాన్ బెన్నెట్ కూడా పోటీ పడగా.. అభిషేక్ శర్మకే ఈ అవార్డ్ వరించింది. అభిషేక్ శర్మ కెరీర్లో ఇదే తొలి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ కావడం గమనార్హం.
ఇక స్మృతి మంధాన కూడా ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 58, 117, 125 పరుగులతో సత్తా చాటింది. ఈ సిరీస్‌లో మంధాన 50 బంతుల్లోనే సెంచరీ బాది ఆకట్టుకుంది. మంధానతో పాటు సౌతాఫ్రికా బ్యాటర్ టాజ్మిన్ బ్రిట్స్, పాకిస్థాన్ ప్లేయర్ సిద్రా అమిన్ ఈ అవార్డ్ రేసులో నిలవగా మంధాననే వరించింది. ఈ అవార్డు సంతోషంగా ఉందని మంధాన తెలిపింది.
Comments