• Oct 18, 2025
  • NPN Log

    అక్టోబర్ మాసం వచ్చిందంటే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు పరమానందం... ఎందుకంటే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే... ఈ సందర్భంగా అభిమానులకు మరింత ఆనందం పంచే ఏర్పాట్లు సాగుతున్నాయి. బాహుబలి సిరీస్ తో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయారు ప్రభాస్. ఆ రెండు సినిమాలతో దేశవిదేశాల్లో ప్రభాస్ అభిమానగణాలు పెరిగిపోయాయి. అందువల్లే ప్రభాస్ మూవీ ఎలా ఉన్నా సరే వసూళ్ళ వర్షాలు కురుస్తున్నాయి.

    ఇక డార్లింగ్ బర్త్ డే వస్తుంది అంటే ఆ నెల మొదటి నుంచే రచ్చ మొదలుపెట్టేస్తారు అభిమానులు. ఈ సారి కూడా ప్రభాస్ అభిమానుల అభినందనల జల్లుల్లో తడవక మానరు.అయితే ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ కు ప్రభాస్ బర్త్ డేన ఒకటి కాదు ఏకంగా ట్రిపుల్ ట్రీట్ దక్కనుందని తెలుస్తోంది. అందులో మొట్టమొదటి ట్రీట్ ఏంటంటే - ప్రభాస్ రాబోయే మూవీ ది రాజా సాబ్ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందట.

     

     

    ఇక రెండో ట్రీట్ విషయానికి వస్తే - ప్రభాస్ తో హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న సినిమా ఫౌజీ. ఈ మధ్యే డ్యూడ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హను రాఘవపూడి - ప్రభాస్ తో తాను రూపొందించే సినిమా విషయమై రెబల్ స్టార్ బర్త్ డేన ఓ విశేషం చెబుతానని అన్నారు. దీంతో కచ్చితంగా టైటిల్ అనౌన్స్మెంట్ అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

     

     

    ఇక మూడో ట్రీట్ ఏంటంటే అక్టోబర్ 31వ తేదీన ప్రభాస్ బాహుబలి- ది ఎపిక్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐమాక్స్, డాల్బీ సినిమా, ఫోర్ డీఎక్స్, డీ-బాక్స్, ఎపిక్యూ, ఐసీఈ, పీసీఎక్స్ ఫార్మాట్స్ అన్నిటా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ బర్త్ డేన బాహుబలి- ది ఎపిక్ ఫ్రెష్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

     

    ఇలా అక్టోబర్ చివరి వారంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్ లభించనుంది. ఆయన బర్త్ డేన ఓ సింగిల్, ఓ ట్రైలర్, ఓ లుక్ - ఇలా ట్రిపుల్ ట్రీట్ సాగనుంది. ఆ ఆనందాన్ని మనసులో నింపుకొని నెలాఖరులో వచ్చే బాహుబలి - ది ఎపిక్ కు స్వాగతం పలకనున్నారు ఫ్యాన్స్. దీంతో ఇప్పటినుంచే ఫ్యాన్ రచ్చ చేయడం మొదలుపెట్టారు. మరి డార్లింగ్ బర్త్ డేన ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో చూడాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement