అమానుషం.. ప్రాణం పోతున్నా చేతులకు బేడీలు
బంగ్లాదేశ్ మాజీ మంత్రి నూరుల్ మాజిద్ మరణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓ కేసులో అరెస్టైన ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించగా అదే సమయంలో చేతికి బేడీలు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. యూనస్ ప్రభుత్వం తీరు అమానుషమని అవామీ లీగ్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే పారిపోకుండా ఉండేందుకు బేడీలు వేశామని పోలీసులు చెప్పడం గమనార్హం. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు నూరుల్ సన్నిహితుడు.
Comments