అమెరికాలో హైదరాబాద్ వాసి దారుణ హత్య
అమెరికాలో దుండగుడి దుశ్చర్యకు మరో తెలుగు వ్యక్తి బలయ్యాడు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఈక్రమంలోనే డాలస్‌లోని పెట్రోల్ బంక్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఓ దుండగుడు పెట్రోల్ కొట్టించుకునేందుకు బంక్‌కు వచ్చి చంద్రశేఖర్‌ను దారుణంగా కాల్చి చంపాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అమెరికా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments