ఆసీస్ ప్లేయర్ అలానా కింగ్ ప్రపంచ రికార్డ్
మహిళా క్రికెట్ ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా క్రికెటర్ సంచలనం సృష్టించింది. నిన్న(శనివారం) ఇండోర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ అలానా కింగ్ 7 వికెట్లతో అదరగొట్టింది. ఆమె స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ప్రోటీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. ఆమె స్పిన్ మాయాజాలంకి సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్ క్యూకట్టారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా మహిళా జట్టు ప్రారంభం నుంచి వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఇక ఆసీస్ స్టార్ స్పిన్నర్ కింగ్ బౌలింగ్ ధాటికి 16.5 ఓవర్లలో కేవలం 97 పరుగులకే కుప్పకూలింది. మొత్తంగా 7 ఓవర్లు బౌలింగ్ చేసిన కింగ్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లను తీసుకుంది. ఈ క్రమంలో కింగ్ పలు రికార్డులను క్రియేట్ చేసింది.
ఉమెన్స్ వరల్డ్ కప్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా అలానా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు జాకీ లార్డ్ పేరిట ఉండేది. 1982 వరల్డ్ కప్‌లో లార్డ్ భారత్‌పై 10 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. తాజా మ్యాచ్‌తో 33 ఏళ్ల ఈ ఆల్ టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేసింది.
మహిళల వరల్డ్ కప్‌లో అత్యుత్తమ బౌలింగ్:
7/18 – అలానా కింగ్ vs సౌతాఫ్రికా, 2025
6/10 – జాకీ లార్డ్ vs ఇండియా, 1982
6/20 – గ్లెనిస్ పేజ్ vs ట్రినిడాడ్ & టొబాగో, 1973
6/36 – సోఫీ ఎక్ల్స్టోన్ vs సౌతాఫ్రికా, 2022
6/46 – అన్యా ష్రబ్సోల్ vs ఇండియా, 2017










Comments