విమానం ఎక్కిన పల్లె
శంషాబాద్ : గ్రామంలో ఎవరైనా విమానంలో ప్రయాణిస్తే దాని గురించి ఊరంతా చర్చించుకుంటారు. అలాంటిది ఒక గ్రామంలోని 500 మంది ఒకేసారి విమాన ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? నాగర్‌కర్నూల్ జిల్లా బిజినెపల్లి మండలం, గుడ్లనర్వ గ్రామానికి చెందిన 500 మంది శనివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని గోవాకు బయలుదేరారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మేకల కావ్య తండ్రి మేకల అయ్యప్ప తన గ్రామస్థులకు ఏదైనా గుర్తిండిపోయేలా చేయాలని అనుకున్నారు. తన చిన్న కుమారుడు మేకల జగపతి- సోనీల నిశ్చితార్థాన్ని గోవాలో తన గ్రామస్థుల మధ్య జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం దాదాపు రూ.2 కోట్లు ఖర్చుపెట్టి రెండు విమానాలను బుక్ చేశారు. తన స్వగ్రామం గుడ్లనర్వకు చెందిన 500 మందిని రెండు విమానాల్లో గోవాకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ.. తన తండ్రి ఒక సామాన్య రైతుగా జీవితం ప్రారంభించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారని, తన గ్రామస్థుల కళ్లల్లో ఆనందం చూడాలని తన తమ్ముడి నిశ్చితార్థం గోవాలో ఏర్పాటు చేసి గ్రామస్థులందరినీ విమానం ఎక్కించారని తెలిపారు. గ్రామస్థుల సంతోషమే తమ సంతోషంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.









Comments