• Mar 02, 2026
  • NPN Log

    పరీక్షల సీజన్ వచ్చేసింది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు మెుదలు కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. మరోవైపు టెన్త్ పరీక్షలకు అతి తక్కువ సమయమే ఉంది. ఈ నేపథ్యంలో పది, ఇంటర్ విద్యార్థుల్లో ఒకవైపు ఉత్సాహం, మరోవైపు ఆందోళన కలగడం సహజం. అయితే, ఎగ్జామ్‌కు వెళ్తే ముందు చిన్నచిన్న పొరపాట్లు చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. పరీక్షలకు వెళ్లే ముందు, రాసే సమయంలో విద్యార్థులు చేయకూడని పొరపాట్ల గురించి తెలుసుకుందాం.

    1. చివరి నిమిషం వరకు చదవడం

    పరీక్ష హాలు లోపలికి వెళ్లే వరకు పుస్తకాలు పట్టుకుని చదవడం వల్ల మెదడు అలసిపోతుంది. దీని వల్ల చదివిన విషయాలు గుర్తుకు రాకపోగా, గందరగోళం ఏర్పడుతుంది.

    2. హాల్ టికెట్, స్టేషనరీ:

    ఎగ్జామ్‌కి వెళ్లే ముందు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి విషయాల్లో ప్రధానమైనది హాల్ టికెట్. ఇంటి నుంచి పరీక్షకు వెళ్లే ముందే హాల్ టికెట్ తీసుకున్నారో, లేదో చెక్ చేసుకోవాలి. స్టేషనరీ అంటే రెండు పెన్నులు, పెన్సిళ్లు మర్చిపోకూడదు. చివరి నిమిషంలో ఇవి లేవని తెలిస్తే వచ్చే ఒత్తిడి పరీక్షలపై ప్రభావం చూపుతుంది. ఎగ్జామ్‌కి వెళ్లే ముందు ఇవన్నీ బ్యాగ్‌లో సిద్ధం చేసుకుంటే మంచిది.

    3. సమయ పాలన లేకపోవడం:

    పరీక్ష రాసేటప్పుడు తెలిసిన ప్రశ్నే కదా అని ఒకే జవాబును గంటల తరబడి రాయొద్దు. కష్టమైన ప్రశ్నల దగ్గర ఆగిపోకుండా, తెలిసినవి ముందుగా పూర్తి చేయండి. మార్కులను బట్టి సమయాన్ని కేటాయించుకోండి.

    4. ఖాళీ కడుపుతో వెళ్లడం:

    కొంతమంది ఎగ్జామ్ హడావుడిలో పడి తినకుండా వెళుతుంటారు. దీని వల్ల పరీక్ష మధ్యలో నీరసం రావడం లేదా ఏకాగ్రత తగ్గడం జరుగుతుంది. అలా అని జంగ్ ఫుడ్, ఎక్కువగా ఆయిల్ ఉన్న, స్పైసీ ఫుడ్ తీసుకుంటే కడుపులో ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంటుంది.

    5. గ్యాప్ లేకుండా చదవొద్దు:

    ఎగ్జామ్స్ టైమ్ లో హార్డ్ గా ఉన్న సబ్జెక్టుపై ఎక్కువ దృష్టి పెడుతుంటారు విద్యార్థులు. అలా ఎక్కువగా అదే సబ్జెక్టుపై ఫోకస్ పెడితే మిగతా సబ్జెక్టులపై ప్రభావం పడుతుంది. చదివేటప్పుడు మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. దీని వల్ల మీ మైండ్ రిలాక్స్ అవుతుంది.

    6. కాఫీ, టీలు తాగకండి:

    కొంతమంది రాత్రి పూట ఎక్కువ సేపు మేల్కొని చదువుతుంటారు. ఆ సమయంలో టీ, కాఫీలు తాగుతుంటారు. అలా ఎక్కువగా తాగితే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

    7. వీటిని తీసుకెళ్లవద్దు..

    పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు సహా ఎలాంటి గాడ్జెట్‌లకు అనుమతి లేదని ఇప్పటికే విద్యార్థులకు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

    8. సమయానికి వెళ్లండి..

    పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా పరీక్ష ప్రారంభమయ్యే సమయం కంటే.. దాదాపు గంట ముందేగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement