ఈ-క్రాప్ బుకింగ్‌కు ఈ నెల 30 లాస్ట్
ఆంధ్రప్రదేశ్ లో ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే రాయితీలు, సున్నావడ్డీ రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల కొనుగోలు, ఇతర సంక్షేమ పథకాలకు ఈ డేటానే ప్రామాణికం. అందువల్ల అన్నదాతలు ఈ నెల 30లోగా ఈ-క్రాప్ బుకింగ్ పూర్తిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఆధార్ కార్డు, భూమి, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్సులు, 1B తీసుకుని మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.
Comments