పొలంలో పిడుగు పడి.. ముగ్గురు మృతి
అలంపూర్ : జోగులంబ గద్వాల్ జిల్లాలో అయిజ మండలం భూంపురంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం పత్తి పొలంలో పనులు చేసుకుంటున్న వారిపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. వారిని గద్వాల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులు సాభాగ్య (40), పార్వతి (22), సర్వేష్ (20)గా గుర్తించారు.
Comments