• Nov 04, 2025
  • NPN Log

    అమరావతి : రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుల్లో రోడ్లు, విద్యుత్తు, నీటి వసతి తదితర మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యమిచ్చి త్వరగా పనులు పూర్తిచేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుల పనుల్లో పురోగతిపై ఎంఎస్ఎంఈ, ఏపీఐఐసీ అధికారులతో మంత్రి సోమవారం సమీక్ష సమీక్షించారు. పారిశ్రామికవేత్తలకు అనుమతులిచ్చే విషయంలో జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్‌, ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ సీఈవో విశ్వమనోహరన్‌ సమావేశంలో పాల్గొన్నారు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement