జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి
ఆంధ్ర ప్రదేశ్ : సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఉదయం జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సురక్ష (30) అనే మహిళ మృతి చెందింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుకు ఐషర్ వాహనం అడ్డురావడంతో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు.










Comments