ఆ ఊర్లో అడుగడుగునా హనుమాన్ ఆలయాలే..
తెలంగాణ : జగిత్యాల(D) వెల్లుల్ల అనే గ్రామంలో ఏ మూల చూసినా, ఏ వాడ తిరిగినా ఆంజనేయుడి గుళ్లే దర్శనమిస్తాయి. 2,500 కన్నా తక్కువ జనాభా ఉన్న ఈ ఊర్లో దాదాపు 45 హనుమాన్ ఆలయాలున్నాయి. పూర్వం ఇక్కడ నివాసమున్న బ్రాహ్మణ కుటుంబాలు తమ వంశాల వారీగా ఎవరికి వారు ఈ ఆలయాలను నిర్మించుకున్నారట. ఈ అన్ని ఆలయాల్లోనూ క్రమం తప్పకుండా పూజలు నిర్వహించడం విశేషం.









Comments