ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం
ఆంధ్ర ప్రదేశ్ : తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సైకాలజీ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ విద్యార్థులను సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై సైకాలజీ డిపార్ట్‌మెంట్ HOD విశ్వనాథ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ‘ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు’ అని అన్నారని, విశ్వనాథ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.









Comments