ఏపీ పీసీబీలో 77 పోస్టులు!
ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(PCB)లో 77 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 18 అనలిస్ట్ గ్రేడ్ బీ పోస్టులకు ప్రభుత్వం అనుమతించింది. వీటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. 40 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులు, 19 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సిద్ధంకండి.
Comments