‘ఐ లవ్ మోదీ’ అనొచ్చు.. ‘ఐ లవ్ మహమ్మద్’ అనకూడదా: ఒవైసీ
యూపీలోని బరేలీలో ‘ ఐ లవ్ మహమ్మద్ ’ అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ధ్వజమెత్తారు. దేశంలో ‘ఐ లవ్ మోదీ’ అంటే ఎలాంటి సమస్య ఉండదని, ‘ఐ లవ్ మహమ్మద్’ అంటే అభ్యంతరమా? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలతో దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారని నిలదీశారు. తాను మహమ్మద్ వల్లే ముస్లింగా ఉన్నానని పేర్కొన్నారు. దేశంలో 17 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారని తెలిపారు.
Comments