కూటమి నేతలతో కలిసే వెళ్లాలి: పవన్ కళ్యాణ్
ఆంధ్ర ప్రదేశ్ : క్షేత్రస్థాయిలో పరిస్థితులను సరిదిద్దుకొంటూ ముందుకెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలను ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న ఆయన క్షేత్ర స్థాయిలో కూటమి నేతలతో కలిసే పనిచేయాలని స్పష్టం చేశారు. అభిప్రాయ భేదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు.
Comments