• Mar 02, 2026
  • NPN Log

    గత వారం ద్వితీయార్ధంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరల్లో ఈ వారం కూడా ర్యాలీ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్‌లో భారత్‌లో పసిడి ధర ఏకంగా రూ.2 వేల మేర పెరిగింది. గత వారం పసిడి ధర సుమారు రూ.4,300 మేర పెరిగిన విషయం తెలిసిందే. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,360గా ఉంది. నిన్న ఇదే సమయానికున్న రేట్‌తో పోలిస్తే రూ.2,080ల మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,910ల మేర పెరిగి రూ.1,47,910కు చేరుకుంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. రూ.10 వేల మేర పెరిగి రూ.3,00,100లకు చేరుకుంది.

    సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. కానీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు 15 శాతం సుంకం విధించడంతో వాణిజ్యంపై సందిగ్ధత నెలకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా డాలర్‌ బలహీనపడి ఇన్వెస్టర్లు బంగారం, వెండి వైపు మళ్లుతున్నారని వివరిస్తున్నాయి . దీనికి తోడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా బంగారం, వెండికి డిమాండ్ కొనసాగేలా చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

    ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు ఇవీ

    చెన్నై: ₹1,62,120; ₹1,48,610

    ముంబై: ₹1,61,360; ₹1,47,910

    ఢిల్లీ: ₹1,61,510; ₹1,48,060

    కొలకతా: ₹1,61,360; ₹1,47,910

    బెంగళూరు: ₹1,61,360; ₹1,47,910

    హైదరాబాద్: ₹1,61,360; ₹1,47,910

    విజయవాడ: ₹1,61,360; ₹1,47,910

    కేరళ: ₹1,61,360; ₹1,47,910

    పుణే: ₹1,61,360; ₹1,47,910

    వడోదరా: ₹1,61,410; ₹1,47,960

    అహ్మదాబాద్: ₹1,61,410; ₹1,47,960

    వెండి (కిలో) ధరలు

    చెన్నై: ₹3,01,100

    ముంబై: ₹2,99,100

    ఢిల్లీ: ₹3,00,000

    కొలకతా: ₹3,00,000

    బెంగళూరు: ₹3,00,100

    హైదరాబాద్: ₹3,00,100

    విజయవాడ: ₹3,00,100

    కేరళ: ₹3,00,000

    పుణే: ₹2,99,000

    వడోదరా: ₹3,00,100

    అహ్మదాబాద్: ₹3,00,000

    గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement