• Mar 01, 2026
  • NPN Log
    • విశాఖపట్నం (గాజువాక)

     

      ట్రాఫిక్ సోల్జర్స్ ను సిపి శ్రీ శంఖ బ్రత బాగ్చి IPS గత  డిసెంబర్ 2025 ప్రారంభించారు.అప్పటి నుండి పోలీసులతో పాటుగా రోడ్డుపై ప్రధాన జంక్షన్ లలో సుమారు 30 మంది ట్రాఫిక్ సోల్జర్స్ విధులు నిర్వహిస్తున్నారు.
          

         సీపీ శ్రీ శంఖ బ్రత బాగ్చి IPS వారు ఇచ్చిన స్ఫూర్తితో గాజువాక ట్రాఫిక్ సోల్జర్స్ కు ఏదైనా అపద సమయంలో ఆదుకునే విధంగా వారికి హెల్త్ ఇన్సూరెన్స్  మరియు టర్మ్ ఇన్సూరెన్స్ చేయాలనే ఉద్దేశంతో స్థానిక ఇరాజ్ హాస్పిటల్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేయగా వారు 30 మంది గాజువాక ట్రాఫిక్ సోల్జర్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయడానికి ముందుకు వచ్చారు. అందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కూడా సహకార అందించారు.సాయంత్రం గాజువాక SBT హోటల్ లో గాజువాక ట్రాఫిక్ సోల్జర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేయడమైనది. ఈ మీటింగ్ కు 30 మంది గాజువాక ట్రాఫిక్ సోల్జర్స్,ఇరాజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు స్టేట్ బ్యాంక్ సిబ్బంది హాజరైనారు. 

     

     ఈ ఈ సందర్భంగా గాజువాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీగా పేరుగాంచిన విశాఖ నగరంలో అధిక జనాభాతో పాటు వలస ప్రాంతాల నుంచి వస్తున్న వేలాదిమంది ప్రజలకు నిరంతరం ట్రాఫిక్ కష్టాలు లేకుండా మాతోపాటు ట్రాఫిక్ సోల్జర్స్ చేస్తున్న కృషికి నేను అభినందిస్తున్నాను. సోల్జర్స్ కు వారి యొక్క ఆరోగ్య భద్రత అలాగే వారికి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ఇరాజ్ ఆస్పటల్ మేనేజ్మెంట్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే యువత మరింత భాగస్వామ్యమై స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ లో చేయూత అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రజలకు ఈ సందర్భంగా తెలిపేది ఏమిటంటే ప్రతి వాహనదారుడు కూడా తప్పక హెల్మెట్ ధరించాలి అలాగే ఆటో డ్రైవర్స్ లారీ కార్ డ్రైవర్స్ ఎప్పుడూ కూడా సీటు బెల్ట్ ధరిస్తూ మద్యపానాన్ని సేవించకుండా ప్రజల రక్షణకు వారి యొక్క భాగస్వామ్యంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీ యొక్క సహకారం ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు.

     
     

        ఇరాజ్ హాస్పిటల్ ఎండి డాక్టర్ దాళిబోయిన శ్రీధర్,డాక్టర్ రావు బాబు,డాక్టర్ రమేష్ నాయుడు హాజరయ్యారు.స్టేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ డిఎన్ఏ నరసింహా మూర్తి,బిజినెస్ మేనేజర్ పవన్ రాత్ లు హాజరయ్యారు.గాజువాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ మరియు ఎస్ఐ శాంతారావు, హెడ్ కానిస్టేబుల్ బంగారు నాయుడు,రాజశేఖర్,లక్ష్మయ్య ఇతర ట్రాఫిక్ సిబ్బందితో పాటు 30 మంది సోల్జర్లు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement