కోహ్లీ కాదు.. అతనే నా ఫేవరేట్ క్రికెటర్: శ్రీచరణి
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టులో కడప జిల్లాకు చెందిన నల్లపు రెడ్డి శ్రీచరణి కీలక సభ్యురాలుగా ఉన్నారు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ అద్వితీయమైన ప్రదర్శనతో భారత్ విశ్వ విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించింది. 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. అత్యుత్తమ ప్రదర్శన(3/41). దీప్తి శర్మ(19) తర్వాత భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో వ్యక్తి శ్రీ చరణ్ . ఇది ఇలా ఉంటే ..ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీ చరణి తన ఆరాధ్య క్రికెటర్ ఎవరో వెల్లడించింది.
భారత మాజీ ప్లేయర్, దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన ఆరాధ్య క్రికెటర్ అని శ్రీచరణి తెలిపింది. ఇంగ్లాండ్ పై యువరాజ్ సింగ్ కొట్టిన 6 బంతుల్లో 6 సిక్స్‌ల వీడియోను లెక్కలేనన్ని సార్లు చూశానని వెల్లడించింది. యువరాజ్ సింగ్‌లా తాను కూడా ఆరు బాల్స్ కు ఆరు సిక్స్‌లు కొట్టాలని ఉందని శ్రీ చరణి తన మనసులోని మాటను బయట పెట్టింది. ప్రస్తుతానికైతే బౌలింగ్ పైనే ఫోక్‌స పెట్టానని, జట్టు అవసరానికి తగ్గట్టు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. క్రికెట్‌లో యువరాజ్ సింగ్ తర్వాత స్మృతి మంధాన, హర్మన్, జెమీమా అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించింది.
 
 
                     
                              
  









 
 
Comments