• Mar 02, 2026
  • NPN Log

    భారత్‌లో గత వారం ద్వితీయార్ధంలో బంగారం, వెండి ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. సుంకాలు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు తీర్పు, అమెరికా-ఇరాన్ యుద్ధ భయాలు బులియన్ మార్కెట్లను అమితంగా ప్రభావితం చేశాయి. అంతర్జాతీయ అనిశ్చితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో ఈ వారం కూడా హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 8.00 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.1,59,570గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,45,990. కిలో వెండి ధర రూ.2,89,900ల వద్ద తచ్చాడుతోంది.

    భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధర ఈ వారం రూ.1.6 లక్షల మార్కు, వెండి ధర రూ.3 లక్షల మార్చును దాటే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్వల్ప దిద్దుబాట్లు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే పసిడి, వెండి ధరల్లో పెరుగుదల తప్పదని చెబుతున్నాయి.

    ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24కే, 22కే) ధరలు

    చెన్నై: ₹1,60,140; ₹1,46,790

    ముంబై: ₹1,59,270; ₹1,45,990

    ఢిల్లీ: ₹1,59,420; ₹1,46,140

    కోల్‌కతా: ₹1,59,270; ₹1,45,990

    బెంగళూరు: ₹1,59,270; ₹1,45,990

    హైదరాబాద్: ₹1,59,270; ₹1,45,990

    విజయవాడ: ₹1,59,270; ₹1,45,990

    కేరళ: ₹1,59,270; ₹1,45,990

    పుణె: ₹1,59,270; ₹1,45,990

    వడోదరా: ₹1,59,320; ₹1,46,040

    అహ్మదాబాద్: ₹1,59,320; ₹1,46,040

    కిలో వెండి ధరలు

    చెన్నై: ₹2,89,900

    ముంబై: ₹2,74,900

    ఢిల్లీ: ₹2,74,900

    కోల్‌కతా: ₹2,74,900

    బెంగళూరు: ₹2,74,900

    హైదరాబాద్: ₹2,89,900

    విజయవాడ: ₹2,89,900

    కేరళ: ₹2,89,900

    పుణె: ₹2,74,900

    వడోదరా: ₹2,74,900

    అహ్మదాబాద్: ₹2,74,900

    గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement