• Mar 02, 2026
  • NPN Log

    అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్న వేళ నిన్న (శుక్రవారం) బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. భారత్‌లో మేలిమి బంగారం ధర సగటున రూ.850ల మేర పెరిగింది. అంతకుముందు రోజున పసిడి రేట్లు ఏకంగా రూ.2200ల మేర పెరిగిన విషయం తెలిసిందే.

    గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.1,57,370కు చేరింది. నిన్నటితో పోలిస్తే ధర రూ.880ల మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.800ల మేర పెరిగి రూ.1,44,250కు చేరింది. నగరంలో వెండి ధరలు మాత్రం నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,69,900గా ఉంది.

    ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ బంగారం స్పాట్ ధర 5,108 డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి 84 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం వైపు మళ్లుతున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

    ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు

    చెన్నై: ₹1,57,300; ₹1,44,190

    ముంబై: ₹1,57,380; ₹1,44,260

    న్యూఢిల్లీ: ₹1,57,530; ₹1,44,410

    కోల్‌కతా: ₹1,57,380; ₹1,44,260

    బెంగళూరు: ₹1,57,380; ₹1,44,260

    హైదరాబాద్: ₹1,57,380; ₹1,44,260

    విజయవాడ: ₹1,57,380; ₹1,44,260

    కేరళ: ₹1,57,380; ₹1,44,260

    పుణె: ₹1,57,380; ₹1,44,260

    వడోదరా: ₹1,57,430; ₹1,44,310

    అహ్మదాబాద్: ₹1,57,430; ₹1,44,310

    వెండి (కిలో) ధరలు

    చెన్నై: ₹2,69,980

    ముంబై: ₹2,69,900

    న్యూఢిల్లీ: ₹2,69,910

    కోల్‌కతా: ₹2,69,900

    బెంగళూరు: ₹2,69,890

    హైదరాబాద్: ₹2,69,900

    విజయవాడ: ₹2,69,900

    కేరళ: ₹2,69,900

    పుణె: ₹2,69,900

    వడోదరా: ₹2,69,850

    అహ్మదాబాద్: ₹2,69,920

    గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement