చిన్నారులు గాయపడటంపై సీఎం ఆవేదన
ఆంధ్ర ప్రదేశ్ : విశాఖ సీతంపేటలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గంజి పడి ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. చిన్నారులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 20 మంది చిన్నారులకు గాయాలవ్వగా వారిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని కలెక్టర్ తెలిపారు.
Comments