జూబ్లీహిల్స్‌లో BRS గెలిస్తే ప్రభుత్వం మారదు: పొన్నం
తెలంగాణ : ఇళ్ల కూల్చివేతపై కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పదేళ్లు పాలించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లైనా కట్టించారా అని ప్రశ్నించారు. గతంలో ఉపఎన్నికల్లో రూ.కోట్ల డబ్బులు, లిక్కర్ సీసాలు బీఆర్ఎస్ పంచిందని ఫైరయ్యారు. జూబ్లీహిల్స్‌లో BRS గెలిచినంతా మాత్రాన ప్రభుత్వం మారదన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయనివాడు జూబ్లీహిల్స్‌కు ఏం చేస్తాడని దుయ్యబట్టారు.
Comments