టైటిల్‌పై సింధు గురి
సార్బ్రూకెన్ (జర్మనీ): ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన ఏస్ షట్లర్ పీవీ సింధు అదే జోరును కొనసాగించాలనుకొంటోంది. మంగళవారం నుంచి జరి గే హైలో ఓపెన్‌లో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. జూలై లో జపాన్ ఓపెన్ గెలిచిన సింధు.. ఆ తర్వాత పారి్‌సలో తుది పోరుకు చేరుకొంది. కానీ, వరల్డ్ నెం:1 అన్ సే యంగ్ చేతిలో ఓడి రన్నర్‌పగా సరిపెట్టుకొంది. తొలి రౌండ్లో నెస్లిహన్ అరిన్ (టర్కీ)తో రెండో సీడ్ సింధు తలపడనుంది. ఆరో సీడ్ ఉన్నతి హుడాతోపాటు వర్ధమాన షట్లర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోడ్, దేవిక సిహాగ్, ఇషారాణి బారువా, అన్మోల్ ఖర్బ్ కూడా బరిలో నిలవనున్నారు. పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ లక్ష్యసేన్‌కు ఏడు, ఆయుష్ శెట్టికి ఎనిమిదో సీడ్ దక్కాయి. తొలి రౌండ్లో జోకిమ్ ఓల్డోర్ఫ్ (ఫిన్లాండ్)తో సేన్, సు లి యంగ్ (తైవాన్)తో ఆయుష్ తలపడనున్నారు. తరుణ్ మన్నేపల్లి, కిరణ్ జార్జ్, హెచ్‌ఎ్‌స ప్రణయ్ కూడా ఆడనున్నారు.










Comments