టెన్త్ పబ్లిక్ పరీక్షలపై సన్నాహాలు షురూ
ఆంధ్రప్రదేశ్ : టెన్త్ పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. మార్చిలో వీటిని చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తోంది. మార్చి 16నుంచి ఆరంభించాలని ఎస్సెస్సీ బోర్డు ప్రతిపాదించింది. అయితే ఇంటర్మీడియెట్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరుగుతాయి. కెమిస్ట్రీ వంటి ముఖ్య సబ్జెక్టు పేపర్లు 17వ తేదీ వరకు ఉన్నాయి. దీంతో టెన్త్ పరీక్షలు ఏ తేదీ నుంచి ప్రారంభమవుతాయనే దానిపై ఆ శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.










Comments