ఢిల్లీలో మందు కొట్టేందుకు వయోపరిమితి 21కి తగ్గింపు!
ఢిల్లీ ప్రభుత్వం నూతన లిక్కర్ పాలసీకి కసరత్తు చేస్తోంది. మద్యం సేవించే అర్హత వయసును ప్రస్తుతమున్న 25 నుంచి 21ఏళ్లకి తగ్గించేలా ముసాయిదాను సిద్ధం చేసింది. అయితే దీనిపై ప్రభుత్వంలోనే ఏకాభిప్రాయం రానట్లు సమాచారం. ఆదాయం తగ్గడంతో కొత్తగా ప్రీమియం బ్రాండ్లను అనుమతించాలని భావిస్తున్నారు. గతంలో మద్యం స్కామ్లో ఢిల్లీ సీఎం సహా పలువురు అరెస్టవడం తెలిసిందే. కాగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ల్లో డ్రింకింగ్ ఏజ్ 21ఏళ్లే.
Comments