ఢిల్లీలో సీఎం రేవంత్‌తో బీసీ సంఘాల భేటీ
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ సబ్‌కోటాపై ఢిల్లీలో రెండు రోజులుగా ఆందోళన చేపట్టిన బీసీ సంఘాల నేతలు శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. డీలిమిటేషన్‌పై పోరాడిన విధంగానే బీసీ డిమాండ్లపై కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచి బీసీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతూ సీఎం రేవంత్‌కు వినతిపత్రం అందజేశారు. తుగ్లక్‌రోడ్డులోని అధికారిక నివాసంలో సీఎం రేవంత్‌ను శనివారం రాత్రి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ నేతలు తాటికొండ విక్రమ్, శ్రీనివాస్, కనకాల శ్యామ్, బి.మణిమంజరి, తారకేశ్వరి కలిశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుదల, జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఈ సందర్భంగా జాజుల శ్రీనివా్‌సగౌడ్ ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్లు జాజుల పేర్కొన్నారు.










Comments