• Apr 19, 2026
  • NPN Log

    అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి మునీర్ ఆసక్తి చూపుతున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మునీర్‌కు పెరుగుతున్న సన్నిహిత సంబంధాలు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఆందోళనలకు కారణమవుతున్నాయట. తాజాగా పాకిస్థాన్ మాజీ జనరల్ అహ్మద్ సయీద్.. మునీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

    ఇరాన్‌లోని ఐఆర్‌జీసీతో ఆసిఫ్ మునీర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని సయీద్ వెల్లడించారు. ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ నేత ఖాసీం సులేమానీ, ఐఆర్‌జీసీ కమాండర్ హోస్సేన్ సలామీతో, సైన్యంలోని ఉన్నతాధికారులతో కూడా మునీర్‌కు పరిచయాలున్నాయని పేర్కొన్నారు. ఇటు అమెరికా, అటు ఇరాన్ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలుండడంతో.. దౌత్య పరంగా కీలక పాత్ర పోషించడంలో మునీర్‌కు ఇబ్బందులు తప్పవని సయీద్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికా నిపుణులు మునీర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    గతంలో అఫ్గానిస్థాన్ యుద్ధ సమయంలో అమెరికా నాయకులు పాకిస్థాన్‌పై ఎక్కువగా ఆధారపడి నష్టపోయారు. ఇటు అమెరికా సహాయం అందుకుంటున్నప్పటికీ.. తమ గడ్డపై తాలిబన్ కార్యకలాపాలను పాక్ చూసీ చూడనట్టు వదిలేసింది. మధ్యవర్తిత్వంలో పాకిస్థాన్ పాత్రను నిశితంగా గమనించాలని, గుడ్డిగా నమ్మకూడదని అమెరికాకు ఫౌండెషన్ ఫర్ డిఫెన్స్ డెమోక్రసీస్ సీనియర్ ఫెలో బిల్ రోజియోమ సూచించారు. అమెరికా ప్రయోజనాలను కాపడేందుకు పాక్ పనిచేస్తుందనే గ్యారెంటీ ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.
     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement