• Oct 05, 2025
  • NPN Log

    భారత్ – చైనా మధ్య త్వరలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గల్వాన్ ఘర్షణల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిని ఐదేళ్లుగా సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. గత నెలలో మోదీ, అంతకుముందు జైశంకర్ చైనాలో పర్యటించడంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయి. ఈ క్రమంలో విమాన సర్వీసుల రాకపోకలకు మార్గం సుగమమైంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement