దగ్గు మందు తాగి చిన్నారుల మృతి.. డాక్టర్ అరెస్ట్
మధ్యప్రదేశ్ చింద్వారాలో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగిన 11 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ మందు వాడాలని సూచించిన వైద్యుడు ప్రవీణ్ సోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సిరప్ తయారు చేసిన తమిళనాడు లోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులు వాడిన దగ్గుమందులో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని, అది విషపూరితమని అధికారులు వెల్లడించారు.
Comments